వికారాబాద్ లో NCC యూనిట్ ను ఏర్పాటు చేయండి

కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ.. సంజయ్ సేత్ కు చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి.


జ్ఞానతెలంగాణ,వికారాబాద్ ప్రతినిధి :

చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో NCC యూనిట్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ ఈరోజు న్యూఢిల్లీ సౌత్ బ్లాక్ లో రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ.సంజయ్ సేథ్ గారితో చేవెళ్ల పార్లమెంటు సభ్యులు & బిజెపి పార్లమెంటరీ పార్టీ విప్ శ్రీ.కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు సమావేశమయ్యారు.మారుమూల ప్రాంతమైన తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్, చేవెళ్ల నియోజకవర్గ విద్యార్థిని, విద్యార్థులకు ఈ NCC యూనిట్ ను వికారాబాద్ లో ఏర్పాటు చేయడం వల్ల ఎంతో ఉపయోగంగా ఉంటుందని పేర్కొన్నారు. అనేకమంది విద్యార్థిని విద్యార్థులు ఈ NCC ద్వారా క్రమశిక్షణ మరియు దేశభక్తి భావనతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో కూడా రిజర్వేషన్ పొందే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ఎం.పి వివరించారు.

జూలై నెల 2024 లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి వికారాబాద్ లో NCC యూనిట్ ఏర్పాటు కోసం లేఖ రాయడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందని ఎంపీ గారు చెప్పారు.

వికారాబాద్ మునిసిపల్ పరిధిలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి కళాశాల ప్రాంగణంలోనీ భవనం లో, ఈ యూనిట్ ఏర్పాటు చేయడానికి కళాశాల యాజమాన్యం కూడా సంసిద్ధత వ్యక్తం చేసి, తెలంగాణ – ఏపీ రాష్ట్రాల NCC డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కు లేఖ రాసిందని ఎం.పి గారు చెప్పారు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి కూడా ఈ యూనిట్ ఏర్పాటు చేయడానికి సానుకూలంగా స్పందించడంతో చిరకాలంగా ఎదురుచూస్తున్న వికారాబాద్ ప్రాంత వాసుల కల నెరవేరుతుందని ఎం.పి శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు ఆశాభవం వ్యక్తం చేశారు.

You may also like...

Translate »