సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న మహిళలు

జ్ఞాన తెలంగాణ, ఝరాసంగం: జనవరి 16 :
ఝరాసంగం మండల కేంద్రంలో సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు ఉత్సాహంగా, ఆనందభరితంగా జరుపుకుంటున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ సందర్భాలను పురస్కరించుకుని గ్రామంలో పండుగ వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది.
పండుగ సంప్రదాయాలలో ముఖ్యమైన భాగమైన ముగ్గులను ఇంటి ముందర అందంగా వేస్తూ మహిళలు సంబరాల్లో భాగమవుతున్నారు. తెల్ల బియ్యపు పిండి, రంగురంగుల పొడులతో వేసిన ఈ ముగ్గులు ఇంటి పరిసరాలను మరింత అందంగా మార్చి పండుగ వైభవాన్ని పెంచుతున్నాయి. ఇంటిని శుభ్రపరుచుకుని, ఆవరణను కళకళలాడేలా అలంకరించడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీగా కొనసాగుతోంది.
సంక్రాంతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ ముగ్గులు గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా మారి, ప్రతి ఇంటిని పండుగ జరుపుకున్నారు
