శ్రీ ఈశ్వర మార్కండేయ దేవాలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం

జ్ఞాన తెలంగాణ,సంగారెడ్డి జిల్లా ప్రతినిధి :

పవిత్రమైన దేవాలయంలో సేవభావంతో పనిచేయాలని టీజీ ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు.పట్టణ పరిధిలోని శ్రీ ఈశ్వర మార్కండేయ దేవాలయ పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా నియమితులైన చైర్మన్, పాలకమండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు టిజిఐఐసి చైర్మన్ ఆలయంలో ఈశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. నిర్మల జగ్గారెడ్డి కు ఆలయ పూజారిలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పవిత్రమైన ఆలయంలో సేవ చేసే అదృష్టం లభించిన ట్రస్ట్ కమిటీ చైర్మన్, పాలకవర్గ సభ్యులు బాగా పనిచేసే మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని ఆమె ఆకాంక్షించారు. ఈశ్వర మార్కండేయ దేవాలయానికి ఎంతో పేరుందని, ఈ దేవాలయానికి వచ్చే భక్తులకు ఏ లోటు లేకుండా చూసుకోవాలని అన్నారు. స్వార్థ బుద్ధితో దేవాలయాల్లో పనిచేయకూడదని, అలాంటి వారిని దేవుడు శిక్షిస్తాడని ఆమె అన్నారు. అనంతరం నూతనంగా ఎంపికైన కమిటీ చేత ఆలయ ఈవో ప్రమాణం చేయించారు. కాగా నూతన కమిటీ చైర్మన్ గా వెంకన్న బాబు (లడ్డు), కమిటీ సభ్యులుగా పి మాణిక్యం, ఎం రామకృష్ణ, కె హరికృష్ణ, ఎం అనిత లను నియమించారు. నిరంతరం భక్తులకు అందుబాటులో ఉంటూ వారికి ఎటువంటి సమస్యలు కలగకుండా చర్యలు తీసుకుంటూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని నూతనంగా ఎంపికైన ఆలయ చైర్మన్ వెంకన్న బాబు (లడ్డు )అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈవో రామారావు, సిడిసి చైర్మన్ గడీల రామ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, మండల అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లు పిల్లోడి విశ్వనాథం, పులిమామిడి రాజు, పట్లూరి నాగరాజ్ గౌడ్, గుండు రవి, శంకర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు,నాయకులు కోడూరి శరత్, ఆశి రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,తుకారాం, బిట్ల ప్రేమ్ కుమార్,వీరన్న, షెజ్జీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

You may also like...

Translate »