శబరిమల పాదయాత్రలో పాల్గొన్న ప్రిథ్వీరాజ్


జ్ఞాన తెలంగాణ – పటాన్ చేరు :
పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన అయ్యప్ప స్వాములు శుక్రవారం రోజు బీహెచ్ఈఎల్ అయ్యప్ప స్వామి ఆలయం నుండి శబరిమల అయ్యప్ప దేవాలయం వరకు మహా పాదయాత్ర నిర్వహించారు.ఈ పవిత్ర యాత్రకు మాదిరి ప్రిథ్వీరాజ్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మాలధారణ భక్తుని ఆధ్యాత్మిక ప్రస్థానంలో ఒక అత్యంత ముఖ్యమైన దశ. ఇది మనసుకు మానసిక ప్రశాంతతను, ఆత్మకు ఏకాగ్రతను ప్రసాదించి, భక్తి భావాన్ని మరింతగా బలపరుస్తుంది. అయ్యప్ప స్వామి ఉపదేశించే నియమం, నిష్ఠ, నియంత్రణ మన జీవన విధానంలో సాత్వికతను నింపుతాయి. ఈ యాత్ర భక్తుల్లో సేవాభావం, సహనశీలత, ఆత్మనిగ్రహం వంటి విలువలను పెంపొందించే ఒక దివ్యమైన అనుభూతి, అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు పాల్గొని, స్వామి సన్నిధి నినాదాలతో పరిసరాలను మార్మోగించారు స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో వాతావరణం భక్తి భావంతో నిండిపోయింది

You may also like...

Translate »