హైటెక్స్ లో ఘనంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి కుమారుడు అనీష్ రెడ్డి వివాహం

- నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు,మాజీ మంత్రి కేటీఆర్
రామచంద్రపురం,అక్టోబర్ 24 (జ్ఞాన తెలంగాణ):
ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి సంగారెడ్డి బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి కుమారుడు అనీష్ రెడ్డి వివాహం నగరంలోని హైటెక్స్‌లో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా నూతన వధూవరులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్లు బండారు దత్తాత్రేయ,ఈ.ఎస్.ఎల్. విద్యాసాగర్ రావు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ తదితరులు హాజరయ్యారు.
వివాహ వేడుకలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని, నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.
