శని అమావాస్యకు సర్వం సిద్ధం

  • శనీశ్వర ఆలయ అర్చకులు పరమేశ్వర్ స్వామి..
  • 23న నిర్వహించే శని పూజలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని పిలుపు

జ్ఞాన తెలంగాణ,సంగారెడ్డి, కొండాపూర్,ఆగస్ట్ 21 : ఈ ఆగస్టు నెల శ్రావణమాసం చివరి రోజు శనివారం అమావాస్య కలిసి రావడంతో శని అమావాస్య పూజలకు మాదాపూర్ లోని శనీశ్వరాలయం ముస్తాబు చేశామని ప్రధాన అర్చకులు పరమేశ్వర స్వామి ఓ ప్రకటనలో తెలిపారు.ఈనెల 23వ తేదీన శనివారం అమావాస్య కలిసి రావడంతో ఈ యొక్క ప్రత్యేకమైన రోజును పురస్కరించుకొని కొండాపూర్ మండల పరిధిలోని మందాపూర్ గ్రామ శివారులో గల శనీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ఈ పూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శని దేవునికి నువ్వుల నూనెతో తైలాభిషేకం,శని నివారణ పూజలు చేస్తే భక్తులకు శని నుండి విముక్తి లభిస్తుందని కావున భక్తులు అధిక సంఖ్యలో పూజలో పాల్గొని దైవ ఆశీస్సులు పొందాలని అర్చకులు పరమేశ్వర్ స్వామి తెలిపారు…

You may also like...

Translate »