అక్రమాల వివరణ కోరుతూ డిఆర్ఓ పద్మజ ని కలిసిన జిల్లా సిపిఐ పార్టీ నాయకులు

జ్ఞాన తెలంగాణ//సంగారెడ్డి//కొండాపూర్//ఏప్రిల్ 09:సంగారెడ్డి జిల్లాకొండాపూర్ మండల పరిధిలోని పలు గ్రామాలలో…మునిదేవుని పల్లి,మన్సన్ పల్లి గ్రామాల్లో అక్రమ వెంచర్లకు అనుమతులు ఇచ్చారని అలాగే నిర్మాణాలు చేపడుతున్న వెంచర్లకు నోటీసులు ఇవ్వకుండా బిల్డర్ లకు సహకరిస్తున్న మన్సాన్ పల్లి ,మునిదేవుని పల్లి పంచాయతి కార్యదర్శులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని టి సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి చంద్ర మోహన్ చారీ కోరారు.
బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లో డిఆర్ఓ పద్మజ రాజునికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని మన్సన్ పల్లి, మునిదేవుని పల్లి అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకొని పంచాయతీ కార్యదర్శులు అవినీతిపై విచారణ జరపాలని అయన కోరారు….
గంగారం చైతన్య వెంచర్లో అక్రమ రోడ్డు నిర్మాణం. మల్లేపల్లి,మల్కాపూర్ లో నిర్మిస్తున్న అక్రమ వెంచర్లపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వ భూములను కాపాడాలని డిఆర్ఓ పద్మజ రాణి కీ వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా టిసిపిఐ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ చారి మాట్లాడుతూ మునిదేవునిపల్లి,మన్సన్ పల్లి గ్రామపంచాయతీ కార్యదర్శుల అవినీతిపై విచారణ జరిపి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు . మామూళ్ల మత్తులో జోరుగా అక్రమ వెంచర్లకు ప్లాట్లకు అనుమతులను ఇస్తున్నారని ప్రభుత్వ భూములు నుంచి ప్రైవేట్ వెంచర్లకు రోడ్లు వేస్తున్న అధికారులు కొండాపూర్ మండలంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ….
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అవినీతికి పాల్పడుతున్న కార్యదర్శులపై అక్రమంగా వెంచర్ల నిర్మిస్తున్న బిల్డర్ లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .
మన్సన్ పల్లి పంచాయతీ కార్యదర్శి వివరణ.
ప్రభుత్వ భూములను కాపాడ వలసింది రెవెన్యూ అధికారులకు ఉంటుంది. మన్సాన్పల్లి గ్రామంలో వున్నా వెంచర్లకు అనుమతులున్నాయి. చిన్న కొద్దిపాటి ఏదైనా ఉంటే నా దృష్టికి రానివి వుంటే సర్వే నెంబర్లతో తెలియజేస్తే పై అధికారుల దృష్టికి వెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు