అమీన్ పూర్ బంధం కొమ్ములో అక్రమ భవనం కూల్చివేత

  • మున్సిపాలిటీ నిబంధనలను ఉల్లంఘించిన భవనాలపై కఠిన చర్యలు..
  • పట్టణ అభివృద్ధి, ప్రజా భద్రత కోసం అక్రమ నిర్మాణాలపై నిఘా..
  • భవిష్యత్తులో అనుమతులేకుండా నిర్మాణాలు జరగకుండా పర్యవేక్షణ మరింత కఠినం..
  • టౌన్ ప్లాన్ అధికారి పవన్

అమీన్ పూర్,అక్టోబర్ 24 (జ్ఞాన తెలంగాణ):

అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో బంధం కొమ్ము ప్రాంతంలోని సర్వే నంబర్ 343/10లో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారి పవన్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ ఆ సిబ్బంది భవనాన్ని కూల్చివేత చేపట్టారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారి పవన్ మాట్లాడుతూ.. భవన నిర్మాణం చేపట్టేటప్పుడు మున్సిపల్ నిబంధన ప్రకారం భవనాలను నిర్మించుకోవాలని, మున్సిపాలిటీ నియమాలను ఉల్లంఘించిన భవనాలు నిర్మిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా టౌన్ ప్లానింగ్ అధికారులు పనిచేస్తారని, ఇలాంటి చర్యల ద్వారా పట్టణ అభివృద్ధి ప్రణాళికను సక్రమంగా అమలు చేయడం, ప్రజా భద్రతను సౌకర్యాన్ని కాపాడడం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.
అంతేకాక, భవిష్యత్తులో కూడా అనుమతులు లేకుండా నిర్మాణాలు జరగకుండా పర్యవేక్షణను మరింత కఠినతరం చేస్తామని హెచ్చరించారు.

You may also like...

Translate »