రైతులకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది

- బి ఎస్ పి నర్సపూర్ నియోజకవర్గం అధ్యక్షుడుజనార్దన్ గౌడ్
నర్సాపూర్ : రైతు స్నేహపూర్వకంగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం, వాస్తవానికి రైతులను మోసం చేస్తుంది ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోగా, సాగు కోసం అవసరమైన మద్దతు ధరలు, రుణమాఫీ, సబ్సిడీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది.ప్రతి క్షణం కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతుల గౌరవాన్ని, ఆర్థిక భద్రతను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పంటలకు యూరియా కూడా సరిపడా సరఫరా చేయలేకపోతుంది ఫలితంగా వేలాది మంది రైతులు అప్పులపాలై, ఆత్మహత్యలకు కూడా దారితీసే పరిస్థితులు ఏర్పడ్డాయి.
రైతుల సమస్యలు పరిష్కరించాలనే హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత మోసగించడం రైతాంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ అసలు వైఖరిని చూపుతుందని
బి ఎస్ పి నర్సాపూర్ నియోజకవర్గం అధ్యక్షుడు జనార్దన్ గౌడ్ గారు అన్నారురైతుల కోసం నిజమైన సంక్షేమం, సరైన మద్దతు ఇచ్చే పాలన అవసరమని మరోసారి స్పష్టమైందని ఆలా జరగలనంటే అది కేవలం బహుజన్ సమాజ్ పార్టీతోనే సాధ్యం అని అయన అన్నారు