ఘనంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జోనల్ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్

ఘనంగా స్కూల్ గేమ్ ఫెడరేషన్ జోనల్ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్
- శంకర్ పల్లి జోన్ మోకిలా రైతు వేదిక క్రీడా ప్రాంగణంలో టోర్నమెంట్ నిర్వహణ
- రంగారెడ్డి జిల్లా విద్యాధికారి చేతుల మీదుగా ప్రారంభమైన క్రీడోత్సవం
- ఎనిమిది జోన్లు ముప్పై రెండు జట్లు తో పండగ వాతావరణం లో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహణ
- అండర్ 17 బాలుర విభాగంలో మొదటి బహుమతి ఎగరేసుకుపోయిన మహేశ్వరం జోన్
- రెండవ స్థానంతో సరిపెట్టుకున్న షాద్ నగర్ జోన్ బాలురు
- మొదటి స్థానంలో నిలిచిన శేరి లింగంపల్లి అండర్ 17 బాలికల జుట్టు
- ద్వితీయ స్థానంలో నిలిచిన రాజేంద్రనగర్ జోన్ బాలికలు
- రంగారెడ్డి జిల్లా వాలీబాల్ జట్టుకు ఎంపికైన పలువురు విద్యార్థులు
- మోకిల సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరబాబు చేతుల మీదుగా విజేతలకు బహుమతుల ప్రధానం
- మోకిలా క్రీడా ప్రాంగణంలో ఆడటం చక్కటి అనుభూతిని ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేసిన క్రీడాకారులు
- అవకాశం ఉంటే మళ్ళీ ఇక్కడే వివిధ టోర్నమెంట్లు నిర్వహించాలని కోరిన పీడీలు
- జిల్లా వాలీబాల్ జట్టుకు ఎంపికైన పలు పాఠశాలల విద్యార్థులు
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జోనల్ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్, శంకర్ పల్లి జోన్ లోని మోకిల రైతు వేదిక క్రీడా ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు చేతుల మీదుగా క్రీడాకారులందరూ క్రీడా ప్రతిజ్ఞ చేయడం ద్వారా 2024-2025 జిల్లాస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు మాట్లాడుతూ నేను కూడా పాఠశాల దశలో వాలీబాల్ ఆడేవాడిని ఇటీవల జరిగిన ఒలంపిక్ లో వాలీ బాల్ ప్రతి మ్యాచ్ చూశాను మీరు కూడా వాలీబాల్ లో రాణించాలంటే నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ బాగా ఆడే వారిని గమనించాలని సూచించారు.

క్రీడలతో పాటు చదువులోను రాణించి వచ్చి భవిష్యత్తులో నిర్మించుకోవాలని తెలియజేశారు. టోర్నమెంట్ లో 8 జోన్లలోని 32 జట్లు అండర్ 17 బాలురు, బాలికలు, అండర్ 14 బాలురు బాలికల జట్లు పాల్గొన్నాయి. ఈ యొక్క క్రీడలకు ఆతిథ్యమిచ్చిన శంకర్ పల్లి జోన్, మోకిలా రైతు వేదిక క్రీడా ప్రాంగణంలో క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కటి ఏర్పాట్లు చేసి, రుచికరమైన భోజనాలు సిద్ధ పరచారు. చక్కటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ క్రీడాకారులు తమ ప్రత్యర్థి జట్లతో ఆధ్యాంతం నువ్వా నేనా అనే విధంగా క్రీడా అభిమానులైన ప్రేక్షకుల కేరింతలు చప్పట్ల నడుమ హోరాహోరీగా పోరాడుతూ క్రీడాభిమానులకు కనువిందు చేశారు. ఈ యొక్క టోర్నమెంట్ లో అండర్ 17 బాలుర భాగంలో మహేశ్వరం జోన్, షాద్ గర్ జోన్ ఫైనల్ లో జరిగిన హోరాహోరీ పోరు లో మహేశ్వరం జోన్ ప్రథమ స్థానం కైవసం చేసుకోగా, షాద్నగర్ ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంది, శేరిలింగంపల్లి అండర్ 17 బాలికలు ప్రథమ బహుమతి, రాజేంద్రనగర్ జోన్ బాలికలు ద్వితీయ స్థానంలో నిలిచారు.

అండర్ 14 బాలికలు విభాగంలో కడ్తాల్ మొదటి స్థానం, మహేశ్వరం జోన్ ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. అండర్ 14 బాలుర విభాగంలో ఇబ్రహీంపట్నం మొదటి స్థానం, మహేశ్వరం జోన్ ద్వితీయ స్థానం సాధించాయి. క్రీడలో ముగింపు సందర్భంగా ముఖ్యఅతిథిగా ఆహ్వానించబడిన స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వీరబాబు గౌడ్ విజేతలకు బహుమతుల ప్రధానం చేశారు. ఈ సందర్భంగా విజయం సాధించిన జట్లకు అభినందనలు తెలియజేస్తూ ఓడిన వారు నిరుత్సాహపడకుండా మళ్లీ వచ్చే సంవత్సరం మరింత ఉత్సాహంతో పాల్గొనడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. పలువురు పిడి లు మాట్లాడుతూ ఇంత గొప్పగా టోర్నమెంట్ నిర్వహించిన స్కూల్ అసిస్టెంట్ ఆశీర్వాదం, మాజీ వార్డు మెంబర్ విఠల్ ను ప్రశంసలతో ముంచెత్తారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు, ఎంపీడీవో వెంకయ్య గౌడ్, మోకిలా సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరబాబు గౌడ్ హాజరుకాగా, శంకర్ పల్లి ఎంఈఓ అక్బరుద్దీన్, చేవెళ్ల ఎంఈఓ పురం దాసు, పట్లోళ్ల నరసింహారెడ్డి, కుమారస్వామి రెడ్డి, అయ్యప్ప రెడ్డి, జిల్లాలలోని వివిధ జోన్ల సెక్రటరీలు, చిన్న కృష్ణారెడ్డి, రాఘవరెడ్డి, సుధాకర్ రెడ్డి, ఎండి సాబీర్, ప్రభాకర్, అరుంధతి, బసవరాజ్, బాబయ్య, జోన్ల ఫిజికల్ డైరెక్టర్లు, వయకర్త గా తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, మాజిక కార్యకర్త పాప గారి ఆశీర్వాదం వ్యవహరించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పొద్దుటూరు ఛైర్మెన్ ఏనుగు లక్ష్మి, ఎం వి ఫౌండేషన్ మండల కోఆర్డినేటర్ నాగమణి, ఉపాధ్యాయులు రఘునందన్ రెడ్డి , కవ్వ గూడెం శ్రీనివాస్, తాహిర్ అలీ, సంజీవరావు, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్, డేవిడ్, విఠల్ వివిధ పాఠశాలల విద్యార్థులు క్రీడాభిమానులు పాల్గొన్నారు.
