రీవాల్యుయేషన్‌లో పాస్ అయ్యే విద్యార్థులు సప్లిమెంటరీ ఫీజు ఎందుకు కట్టాలి

జ్ఞాన తెలంగాణ రాజేంద్రనగర్ సెప్టెంబర్ 14


ఉస్మానియా యూనివర్సిటీలో రీవాల్యుయేషన్ కు వచ్చిన డబ్బులు విద్యార్ధులకు తిరిగి చెల్లించకుండ ఆ డబ్బులు ఎక్కడికి మల్లుతున్నాయని స్వామి నారాయణ గురుకులం బిఈడి విద్యార్థి కె శ్రీను నాయక్ ప్రశ్నించారు.
ఉస్మానియా యూనివర్సిటీలో భారీ కుంభకోణం. జరుగుతోందన్నారు.
రీవాల్యుయేషన్‌లో పాస్ అయ్యే విద్యార్ధి సప్లిమెంటరీ ఫీజు ఎందుకు కట్టాలి అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో భారీ కుంభకోణం. ఇదేమి మొదటి సారి కాదు. గత కొన్నేళ్లుగా జరుగుతున్న వైనం . రీవాల్యుయేషన్ ఫలితాలు వెలువడకముందే సప్లిమెంటరీ పరీక్ష ఫీజు కట్టించుకుంటున్నారు. యూనివర్సిటీ పరిధిలో జరిగే డిగ్రీ , పీజీ , బి.ఎడ్ మరియు ఈతర పరీక్షలోను ఇదే వైనం .
ఉదాహరణకు ఒక విద్యార్థికి వెయ్యి రూపాయలు సప్లిమెంటరీ పరీక్ష ఫీజు కట్టి రీవాల్యుయేషన్ లో పాస్ అయితే ఆ వెయ్యి రూపాయలు నష్టపోయినట్టే . ఒకవేల పదివేల మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ లో పాస్ అయితే వాళ్ళు కట్టిన సప్లిమెంటరీ ఫీజు విలువ కోటి రూపాయలు. అల ఎన్ని వేల విద్యార్థులు నష్టపోతున్నారు. ఓక సంవత్సరానికి రెండు సెమిస్టర్లు. అంటే ఎన్ని కోట్ల రూపాయలేం అవుతున్నాయన్నారు

You may also like...

Translate »