పొద్దుటూరులో నీటి కాలువ కబ్జా – చెరువుకు అడ్డంకులు!

అసైన్డ్ భూముల తర్వాత నీటి వనరులపై దోపిడి

అక్రమ కబ్జాదారులను అడ్డుకోండి

పొద్దుటూరు చెరువుకు జీవం పోయండి

పొద్దుటూరులో నీటి వనరుల దోపిడీపై ప్రజల్లో ఆగ్రహం


జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: పొద్దుటూరు గ్రామానికి ప్రధాన జీవనాధారం అయిన పెద్ద చెరువును నింపే కీలకమైన బూరుగోడుక నీటి కాలువ ఇప్పుడు అక్రమ కబ్జాదారుల వలలో చిక్కుకుంది. వర్షపు నీరు ఈ కాలువ ద్వారా చెరువులో చేరాల్సి ఉండగా, కొంత మంది ప్రైవేట్ వ్యక్తులు దానిని పూర్తిగా మూసివేయడం గ్రామస్థుల ఆగ్రహానికి కారణమైంది.గ్రామంలోని చెరువులను మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన కేసీఆర్ ప్రభుత్వం నీటి నిల్వలు పెంచి భూగర్భజలాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, కబ్జాల వల్ల కాలువ మూసుకుపోవడం గ్రామ రైతులు, ప్రజలకు నీటి కొరతను మరింత తీవ్రతరం చేస్తోంది.ఈ అక్రమ కబ్జాలను ఖండించిన మాజీ వార్డు మెంబర్ నాని రత్నం, “నీటి కాలువను మూసివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వెంటనే కాలువను తిరిగి తెరచి చెరువును నింపే ఏర్పాట్లు చేయాలి” అని డిమాండ్ చేశారు.
ఈ నీటి కాలువ పొద్దుటూరు రెవెన్యూ పరిధిలోని 334 సర్వే నంబర్ భూభాగంలో ఉంది. కావున సంబంధిత అధికారులు పరిశీలించి తక్షణమే కాలువను అక్రమ కబ్జాదారుల నుంచి విముక్తి చేసి, చెరువుకు నీటిని అందించే చర్యలు తీసుకోవాలని నీటి వనరులను కాపాడేందుకు అధికారులు, రెవెన్యూ శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని పొద్దుటూరు గ్రామ ప్రజలు కోరుతున్నారు.

స్పష్టంగా కనిపిస్తున్న కాలువ (బూరుగోడుక)

మాయమైన కాలువ ఆనవాళ్లు, ఇటునుండి పైకి పూర్తిగా మాయం (బూరుగోడుక)

You may also like...

Translate »