ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా తప్పదు

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా తప్పదు
- చేవెళ్ల సీఐ వెంకటేశం
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:
ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాటిని ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానా తప్పదని ట్రాఫిక్ సీఐ వెంకటేశం తెలిపారు. శంకర్ పల్లి మండలం మోకిల ప్రధాన రహదారి పక్కన ట్రాఫిక్ నియంత్రణ లో భాగంగా బుధవారం వాహనాల తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ వెంకటేశం మాట్లాడుతూ… ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కారు డ్రైవింగ్ చేస్తున్న వారు సీటు బెల్టు ధరించాలన్నారు.సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ , ట్రిపుల్ రైడింగ్ చేసిన వారు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం శిక్షార్హులని అన్నారు, మద్యం సేవించి వాహనాలు నడప రాదని, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను, ట్రాఫిక్ సూచనలను పాటిస్తూ ట్రాఫిక్ పోలీసు లకు సహకరించాలని కోరారు. వాహనాలపై పెండింగ్ ఉన్న చలాన్లను ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. హెడ్ కానిస్టేబుల్ శ్రీశైలం, శ్రీనివాస్, రవి సిబ్బంది ఉన్నారు.
