మొకిల లో తుల్జా భవాని మెస్ ప్రారంభం

మొకిల లో తుల్జా భవాని మెస్ ప్రారంభం


– ముఖ్య అతిధి గా చేవెళ్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ భీమ్ భరత్
– విశిష్ట అతిధులు గా దేవుల నాయక్, అశోక్ నాయక్ లు
– ఆత్మీయ అతిధులు గా మొకిల తండా మాజీ సర్పంచ్ నిలమ్మ,మొకిల మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి,
– పెద్ద ఎత్తున పాల్గొన్న నాయకులు,కుటుంబ సభ్యులు
– ప్రభుత్వ ఉద్యోగం రాజీనామా చేసి వ్యాపార రంగంలో దూసుకుపోతున్న వర్థ్య కిషన్ నాయక్ కు అభినంధించిన నాయకులు

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి:
శంకర్‌పల్లి మండల పరిధిలోని మోకిల గ్రామంలో బుధవారం తుల్జా భవాని హోటల్ ను చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా భీమ్ భరత్ మాట్లాడుతూ ఫుడ్ లవర్స్ కు మోకిల అడ్డాగా మారిందన్నారు. అద్భుతమైన రుచులతో అన్ని రకాల వంటకాలను అందిస్తుందని చెప్పారు. హోటల్ కు వచ్చే కస్టమర్లకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. హోటల్ ను ఏర్పాటు చేసిన కిషన్ నాయక్ కు భీమ్ భరత్ శుభాకాంక్షలు తెలిపారు. హోటల్ ను ప్రారంభించిన భీమ్ భరత్ ను హోటల్ యజమాని కిషన్ నాయక్ శాలువాతో ఘనంగా సత్కరించి, కృతజ్ఞతలు తెలియజేశారు. హోటల్ యజమాని కిషన్ నాయక్ మాట్లాడుతూ హైదరాబాద్, శంకర్‌పల్లి పట్టణాలకు సమీపంలో మోకిల ఉండటంతో పాటుగా ఈ ప్రాంతం నుంచి హైదరాబాదుకు తరచుగా విద్యార్థులు, వ్యాపారవేత్తలు ప్రయాణిస్తుంటారు. చుట్టుపక్కల ఉన్న వివిధ గ్రామాల ప్రజలు, ఆహార ప్రియులు తమ అభిమాన బిర్యానీని తమకు దగ్గర్లోనే ఆస్వాదించవచ్చని పేర్కొన్నారు.యువకులందరూ కూడా వ్యాపార రంగంలో రాణిస్తూ వారి సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఎంతో మందికి ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరారు.
పెరుగుతున్న పట్టణీకరణ లో వ్యాపార రంగం ఎంతో అభివృద్ధి చెందుతుందని, వ్యాపార రంగం ఎంతోమందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుందన్నారు.
హోటల్ యజమాని కిషన్ నాయక్ మాట్లాడుతూ
అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో ఉంటాయని, వెజ్ నాన్ వెజ్ లో వెరైటీ వంటలు, రుచికరమైన భోజనం అందుబాటులో ఉంటుందని,పట్టణ ప్రజలు తమ రుచులను మనస్ఫూర్తిగా ఆస్వాదించాలని కోరారు.
కార్యక్రమంలో చేవెళ్ల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పెంటారెడ్డి, మోకిలా తండా మాజీ సర్పంచ్ నీలమ్మ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి, దేవల నాయక్, అశోక్ నాయక్, గ్రామస్తులు,కిషన్ నాయక్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »