సుల్తాన్ పల్లి లో వాగుతో అవస్థలు

పట్టించుకునే నాధుడే కరువయ్యారని స్థానికుల ఆరోపణ
జ్ఞానతెలంగాణ, రాజేంద్రనగర్, అక్టోబర్ 03 :
వర్షం పడిన ప్రతిసారి వాగు ఉప్పొంగి అవతలి గ్రామాలకు వెళ్లాలంటే అవస్థలు పడుతున్న గత కొన్ని నీళ్లు గా పట్టించుకునే నాధుడే కరువయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని సుల్తాన్ పల్లి గ్రామంలో వాగు దుస్థితి మరి అధ్వానంగా మారిందని ఇటీవల కురిసిన వర్షాలకు భారీ ఎత్తున వరదలు రావడం వాగు కూడా ఉధృతంగా ప్రవహించడంతో అటువైపున ఉండే గ్రామాలు ఇటువైపున ఉండే గ్రామాల రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కల్పిస్తుందని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సుల్తాన్ పల్లి నుంచి కేబి దొడ్డి, ఆముదపూర్ మొయినాబాద్ వెళ్లే వారు ఇదే మార్గం నుంచి వెళుతుంటారు. గతంలో సుల్తాన్పల్లి నుంచి కేవీ దొడ్డు వరకు వేసిన రోడ్డు పూర్తిగా శిథిలావస్థలోకి చేరి గుంతలుగా మారి ఉండడం దీనికి తోడు వాగు వర్షం పడిన ప్రతిసారి వెళ్లలేకుండా ఉండడంతో ఇరుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్న కనీసం పట్టించుకునే వారే కరువయ్యారని ఆరోపిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు భారీ ఎత్తున వాగు ప్రవహించడంతో అటు మార్గం గుండా వెళ్లే వాళ్ళు ఇన్ని అవస్థలు పడుతున్నారో పై చిత్రంలో చూడవచ్చు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు దృశ్య సారించి ఈ మార్గంలో సౌకర్యవంతమైన రవాణా మార్గం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
