– జేబిఐటీ కళాశాల ఎదుట ఘోర రోడ్డు ప్రమాదం – భోజనం చేదాం అని కారు దిగగానే వెనకనుంచి వచ్చి టక్కర్ చేసిన – మరో కారురోడ్డు పైన ఉన్న షెడ్లను తొలగించిన ట్రాఫిక్ సిబ్బంది1
జ్ఞాన తెలంగాణ,మొయినాబాద్ ఫిబ్రవరి 19 :
బిజాపూర్ రహదారి పేరు వింటేనే బిత్తరపోతున్న ప్రయాణికులు, ఏ సమయంలో ఎక్కడ నుండి మృత్యువు వెతుకుంటూ వస్తుందో అని బిక్కు బిక్కుమంటూ ప్రయాణం చేస్తుంటారు ప్రజలు. నిత్యం ఏదో ఒక ప్రమాదం, ఎవరో ఒక్కరు వాళ్ల కుటుంబ సభ్యులను కోల్పోవడం నిత్య ఆచరణగా మారింది. ఒకవైపు ప్రభుత్వం బిజాపూర్ రహదారి పనులను వేగవంతం చేస్తున్నాం అని ప్రకటనలు చేస్తున్నారు కానీ పనులు మాత్రం నత్త నడకగా సాగుతున్నాయి అని స్థానికులు విమర్శిస్తున్నారు.
భోజనం కోసం కారు దిగి కానరాని లోకాలకు…
బుధవారం రోజు బండ్లగూడకు చెందిన టెంట్ హౌస్ వ్యాపారి భోజనం చేయడానికి అమ్డాపూర్ కూడలిలో రోడ్డు పక్కన ఉన్న భోజనశాలలో వెళదాం అని కారు దిగగానే వెనకాల వికారాబాద్ నుండి వస్తున్న ఎర్టిగా కారు అతడిని డీకొట్టడంతో ఆ వ్యక్తి తీవ్రగాయలతో రోడ్డు పక్కన పడిపోవడంతో అక్కడే ఉన్న బీజేపీ మండల అధ్యక్షులు మాధాపురం శ్రీకాంత్ క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్ కు తరలించి పోలీస్ లకు సమాచారం అందించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎర్టిగా కారులో ప్రయాణిస్తున్న వారు కూడా తీవ్ర గాయలకు లోనయారని పోలీస్ లు తెలిపారు.
కారు ఆపకుండా వెళ్లిన కాలే యాదయ్య
అమ్డాపూర్ కూడలి దగ్గర ఆక్సిడెంట్ జరిగిన తర్వాత కూడలిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది, భారీగా జనాలు గుమ్మికూడడంతో పోలీస్ లు వారిని నివారించే పనిలో ఉన్నారు ఈ సమయంలోనే అదే దారిలో వెళుతున్న స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య ప్రమాదం జరిగిన దారిలో చూసి చూడనట్లుగా వెళ్లిపోయారు అతడితో పాటు మరో సీనియర్ నాయకుడు ఉండడం విశేషం, వారి కనీసం క్షతగాత్రులను పరామర్శించడం కానీ, ఘటన స్థలంలో ఏమి జరిగిందో కూడా తెలుసుకోకుండా వెళ్లడం అక్కడ ఉన్నవారి అందరిని విస్మయానికి గురి చేసింది.