ప్రొద్దుటూరు గ్రామంలో గణేష్ చతుర్థి ఉత్సవాల ఆధ్యాత్మిక వాతావరణం

  • రికార్డ్ స్థాయిలో లడ్డూలు స్వాధీనం,బాల గణేష్ రూ.40,000,
  • యువసేన యూత్ గణేష్ రూ.1,57,000 లకు
  • కైవసం చేసుకున్న పులకండ్ల రఘుపతి రెడ్డి
  • ఘనంగా సన్మానించిన ఉత్సవ కమిటీ, వెళ్లి విరిసిన భక్తి ఐక్యత

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలం, ప్రొద్దుటూరు గ్రామంలో గణేష్ చతుర్థి వేడుకలు ప్రతి సంవత్సరం ఆధ్యాత్మికంగా జరుగుతున్నాయి. గ్రామంలోని వృద్ధులు, యువత, పిల్లలు భక్తి భావంతో గణపతిని ఆరాధిస్తూ, ఆధ్యాత్మికత, సమాజ ఐక్యతను ప్రతిబింబిస్తున్నారు.ఈ సందర్భంగా, బీజేపీ శంకర్‌పల్లి మండల వైస్ ప్రెసిడెంట్ పులకండ్ల రఘుపతి రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా ఆధ్యాత్మిక చింతనతో గణేష్ లడ్డూను స్వాధీనం చేసుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా రాఘుపతి రెడ్డి బాల గణేష్ లడ్డూను రూ.40,000కు, యువసేన యూత్ గణేష్ లడ్డూను రూ.1,57,000కి స్వాధీనం చేసుకున్నారు. ఇది ప్రొద్దుటూరు గ్రామంలో రికార్డ్ స్థాయి ధరగా నిలిచింది.

ఉత్సవ కమిటీ సభ్యులు రాఘుపతి రెడ్డి భక్తి, ఆధ్యాత్మికత మరియు గ్రామాభివృద్ధికి ఉన్న నిబద్ధతను గుర్తించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గణపతి అనుగ్రహం లేకుండా ఏ పని సఫలమవ్వదు. ప్రతి సంవత్సరం లడ్డూ రూపంలో లభించే ప్రసాదం నా కుటుంబానికి, గ్రామానికి, సమాజానికి శాంతి, ఐక్యత మరియు ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. ఇది కేవలం లడ్డూ కాదు… గణపతి బాప్పా ఇచ్చే ఆశీర్వాదం, దైవానుగ్రహం. లడ్డూ స్వాధీనం ద్వారా భక్తి విశ్వాసంతో గ్రామ అభివృద్ధికి, సమాజ ఐక్యతకు దోహదపడుతుందని భావిస్తున్నానని అన్నారు.

ప్రొద్దుటూరు గ్రామ ప్రజలు ఈ భక్తిపూర్వక కార్యక్రమంలో పాల్గొని, ఆధ్యాత్మిక విలువలను, భక్తి విశ్వాసాన్ని పునరుజ్జీవింపజేశారు. ప్రతి సంవత్సరం గణేష్ లడ్డూ కార్యక్రమం గ్రామానికి, యువతకు మరియు భక్తులకు ఒక మార్గదర్శకంగా నిలుస్తోంది. రఘుపతి రెడ్డి భక్తి, దైవానుగ్రహం మరియు సమాజ అభివృద్ధికి గల తన నిబద్ధతను స్థానికులతో పంచుతూ, ప్రొద్దుటూరు గ్రామంలో భక్తి మరియు ఐక్యతను పెంపొందిస్తున్నారు.

You may also like...

Translate »