తప్పిపోయిన కొండకల్ వాసి, మోకిలా పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు

తప్పిపోయిన కొండకల్ వాసి


– మోకిలా పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి :
శంకర్ పల్లి మండలం, కొండకల్ గ్రామానికి చెందిన ఒగ్గు మల్లయ్య తనయుడు ఒగ్గు విట్టలయ్య తప్పిపోయిన సంఘటన శంకర్ పల్లి మండలంలోని మోకీలా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మోకిలా పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం కొండకల్ గ్రామానికి చెందిన ఒగ్గు విట్టలయ్య వయసు డెబ్బై సంవత్సరాలు, అక్టోబర్ 22 మంగళవారం రాత్రి 10 గంటలకు తన కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి భోజనం చేసి పడుకున్నాడు. 23 అక్టోబర్ అర్ధరాత్రి దాదాపు రెండు గంటల 30 నిమిషాలకు తన కుమారుడైన ఒగ్గు గోపాల్ మేల్కొని చూడగా పడుకున్న స్థలంలో తన తండ్రి యైన విట్టలయ్య లేకపోయేసరికి పరిసర ప్రాంతాలలో ఎటు చూసినా తన ఆచూకీ కనిపించలేదు. తప్పిపోయిన ఒగ్గు విట్టలయ్య వయసు 70 సంవత్సరాలు, ఎత్తు ఆరు అడుగులు, గోధుమ రంగు వెంట్రుకలు, తెలుపు రంగు కమీజు, తెలుపు రంగు దోతీ, లో ఉన్నాడని, తెలుగు భాషలో మాట్లాడగలడని, తప్పిపోయిన విట్టలయ్య కుమారుడు ఒగ్గు గోపాల్ అక్టోబర్ 23 న, పదహారు గంటలు 30 నిమిషాలకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోకిలా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

You may also like...

Translate »