క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ పండుగ

బిఆర్ఎస్ యువనేత మాజీ జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి


జ్ఞాన తెలంగాణ,షాబాద్,మార్చి 31:

రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు బిఆర్ఎస్ యువనేత మాజీ జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. షాబాద్ మండల కేంద్రంలోని దోమినార్ ఈద్గా వద్ద ప్రార్థనలలో ఆయన పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాసాలు చేస్తూ, దానధర్మాలు చేస్తారని తెలిపారు. పండుగ అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుందని క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ పండుగ ప్రత్యేకత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, యువకులు, నాయకులు పాల్గొన్నారు.

You may also like...

Translate »