కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కచ్చితంగా అమలు చేస్తుంది…

సర్ధార్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్ రెడ్డి


జ్ఞాన తెలంగాణ,షాబాద్,జనవరి 28:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పథకాల ప్రారంభోత్సవాల్లో భాగంగా చేపట్టిన 606 గ్రామాలలో భాగంగా షాబాద్ మండలంలోని ఏట్ల ఎర్రవల్లి గ్రామంలో నిన్న ఈ పథకాల ప్రారంభోత్సవం చేయడం జరిగింది .దీనిలో భాగంగా ఎర్రవల్లి గ్రామరైతుల అకౌంట్లోకి 64,45000/-రూపాయలు జమ చేసింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కచ్చితంగా అమలు చేస్తుందని, వీటితో పాటు మిగతా పథకాలను అమలు చేస్తుందని, సర్దార్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ పీసరి సురేందర్ రెడ్డి అన్నారు.ఏట్ల ఎర్రవల్లి గ్రామ రైతుల అకౌంట్ లో డబ్బులు వేసినందుకు గాను ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి ప్రతేక ధన్యవాదాలు తెలిపారు.

You may also like...

Translate »