గెజిటెడ్ హెచ్ఎం పై బజరంగ్ దళ్ నాయకులు అయ్యప్ప భక్తుల ముసుగులో దాడి చేయడం హేయమైన చర్య

దాడి చేసిన వ్యక్తులను కేసు నమోదు చేసి జైలుకు పంపాలి


  • తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలి,
  • దాడి చేసిన వ్యక్తులను కేసు నమోదు చేసి జైలుకు పంపాలి,
  • రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బీఎస్పీ నేత దొడ్డి శ్రీనివాస్ డిమాండ్,

జ్ఞాన తెలంగాణ, షాద్నగర్, షాద్నగర్ ప్రతినిధి, డిసెంబర్ 29:

రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామ గెజిటెడ్ హెచ్ఎం రాములు పై ఆర్ఎస్ఎస్ ,బజరంగ్దళ్ చెందిన నాయకులు అయ్యప్ప భక్తుల ముసుగులో దాడి చేయడం హేయమైన చర్య అని, భక్తి మార్గాన వెళుతున్న అయ్యప్ప భక్తులు, ఆర్ఎస్ఎస్ బిజెపి కుట్రలో భాగస్వాములు కావద్దని, అలాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు, దాడి చేసిన నాయకుల పై చట్టపరమైన చర్యలు చేపట్టి వారిని జైలుకు పంపాలని రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బీఎస్పీ నేత దొడ్డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అనుకోకుండా జరిగిన సంఘటనకు పెద్ద దుమారం లేపి, సమాజంలో అలజడికి కారణమైన వ్యక్తులపై ఎందుకు చట్టపరమైన చర్యలు చేపట్టలేదో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సిపి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు, విద్యార్థుల కాలు, ఉపాధ్యాయులు మొక్కడం ఏ రకమైన సంస్కృతికి నిదర్శనం అని ప్రశ్నించారు, రాజ్యాంగాన్ని చేత పట్టుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, దాడి జరిగి మూడు రోజులు గడుస్తున్న చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు, గెజిటెడ్ హెచ్ఎం రాములు గారు దళితుడు అయినందువలన, నిరలంగా నిర్లక్ష్యం, వహించడం తగదన్నారు, ఇప్పటికైనా దళిత సమాజం కళ్ళు తెరిచి కుట్రలను పసిగట్టాలన్నారు, ప్రభుత్వాలు మారిన దళితులపై దాడులు ఆగట్లేదని, కుట్రపూరితంగా జరిగే దాడుల పట్ల అప్రమతమై ఇలాంటి దాటలను తిప్పికొట్టుటకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

You may also like...

Translate »