పొద్దుటూరు గ్రామానికితెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
– రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి
– ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా నిర్మించిన ఎక్స్పీరియం పార్క్ ను ప్రారంభించ నున్న రాష్ట్ర ముఖ్యమంత్రి
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండలం లోని పొద్దుటూరు గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు రానున్నారు. ఎక్స్పీరియం పార్క్ అధినేత రాందేవ్ రావు 150 ఎకరాల విస్తీర్ణంలో 25 వేల అరుదైన మొక్కలను పెంచి ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా గొప్పగా తీర్చిదిద్దిన పార్కును రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ప్రారంభించనున్నారు. శంకర్పల్లి మండలంలోని పొద్దుటూరు గ్రామానికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం తో మండలంలో పండుగ వాతావరణం నెలకొంది రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలకడానికి స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య స్థానిక ప్రజా ప్రతినిధులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పొద్దుటూరు గ్రామ చరిత్రలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి పొద్దుటూరు గ్రామాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.