మన్మర్రి పాఠశాలలో తెలంగాణ ఆహార మహోత్సవం

మన్మర్రి పాఠశాలలో తెలంగాణ ఆహార మహోత్సవం



తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం ఈరోజు షాబాద్ మండలంలోని ప్రాథమిక పాఠశాల మన్మరిలో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా విద్యార్థులు, మరియు వారి తల్లిదండ్రుల భాగస్వామ్యంతో ఇంటిదగ్గర తయారు చేసుకొని తెచ్చిన వివిధ రకాల పిండి పదార్థాల, మాంసకృతుల,పీచు పదార్థాల,విటమిన్ల పోషక విలువలు గల ఆహార పదార్థాలు,కూరగాయలు
ఆకుకూరలు, పండ్లు,పాలు,
పెరుగు తదితర తినుబండారాలను పాఠశాలలో ప్రదర్శించడం జరిగింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ,మరియు ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్ మాట్లాడుతూ… విద్యార్థుల శారీరక మరియు మానసిక అభివృద్ధి కోసం ప్రతిరోజు పౌష్టికాహారాన్ని తల్లిదండ్రులు అందించాలని అందులో ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరలు,పిండి పదార్థాలు,మాంసకృతులు గల ఆహారాన్ని అందించాలని తెలపడం జరిగింది.పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరగాలంటే ప్రతి రోజు ఉడికించిన కోడిగుడ్డు,పాలు,పెరుగు, మాంసకుతులకు సంబంధించిన ఆహార పదార్థాలను పెట్టాలని,వీదుల్లో దొరికే లేస్,కుర్కురే,మాగీ, నూడుల్స్,మంచూరియా, ఫిజ్జా,బర్గర్ తదితర జంక్ ఫుడ్ కు దూరంగా ఉంచాలని తెలిపి,పిల్లలు ఆహారాన్ని తీసుకునే ముందు చేతులు శుభ్రంగా సబ్బుతో గాని,డెటాల్ తో గాని కడుకోవాలని వివరించి,విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కి గురి కాకుండా వంట చేసేటప్పుడు ఇంటిదగ్గర గాని, పాఠశాలల్లో గాని వంట పాత్రలు శుభ్రంగా కడగాలని,అదేవిధంగా కూరగాయలు మంచినీటితో శుభ్రం చేయాలని,వండిన ఆహారంపై సరిపడా మూతలు పెట్టాలని తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో విద్యార్థులు, మరియు వారి తల్లిదండ్రులు శంకర్,రవి మల్లేష్,యాదయ్య,నరసింహులు, మమత,వెంకటేశ్వరి, యాదమ్మ,నాజియా, నూరిన్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »