రోజురోజుకు పెరుగుతున్న టంగటూరు – మోకిలా రోడ్డు కష్టాలు

  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామ ప్రజలు

జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామం నుండి మొకిలా వైపు వెళ్లే రోడ్డు ప్రతిరోజూ ప్రమాదాలకు కారణమవుతోంది. ప్రతి రోజు బురద కారణంగా లారీలు, ట్రక్కులు ఇరుక్కుపోగా, ప్రయాణికులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మూడుసార్లు ఎమ్మెల్యేగా కాలే యాదయ్య పార్లమెంట్ సభ్యుడుగా కొండ విశ్వేశ్వర రెడ్డి ని గెలిపించి రోడ్డు సమస్య పరిష్కారం కోసం ఆశ పెట్టుకున్నారు. అయితే, ఇప్పటికీ రోడ్డు మరమ్మత్తులు పూర్తిగా చేయబడలేదు.ప్రజల్లో ఈ పరిస్థితి పట్ల తీవ్ర ఆగ్రహం నెలకొంది. “ఎంతకాలం ఈ రోడ్డు సమస్య కొనసాగుతుంది? సమస్యకు కారణం ఓటర్లా? లేదా నాయకులా? అని సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు.ఇప్పటికి రోడ్డు నిర్మించకపోవడంతో బురదలో ఇరుక్కుపోయే వాహనాలు, ప్రయాణికుల కష్టాలు, వాణిజ్య వ్యాపారాలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది.తక్షణమే రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

You may also like...

Translate »