కొత్తూరు లో కి జి బి వి విద్యార్థుల ప్రతిభ

ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మున్సిపల్ చైర్మన్ లావణ్య దేవేందర్ యాదవ్


జ్ఞాన తెలంగాణ,కొత్తూరు,షాద్ నగర్ ప్రతినిధి మార్చ్ 10:
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో ఈగల్ కుంఫు మార్సులర్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఓపెన్ నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2025 నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో చౌదర్ గూడా మండల్ కస్తూర్బా గాంధీ హాస్టల్ విద్యార్థులు పాల్గొనడం జరిగింది. పటాస్ సీనియర్ విభాగంలో ఎం. వైష్ణవి సెకండ్ ప్లేస్ సాధించగా పటాస్ జూనియర్ విభాగంలో జి.సంధ్య, ఎం. అక్షిత కె. ఇందు ప్రియ థర్డ్ ప్లేస్ సాధించారు. స్పైరింగ్ విభాగంలో పి. అమూల్య, కె. మంజుల థర్డ్ ప్లేస్ సాధించారు. గెలుపొందిన విద్యార్థులకు ఎక్స్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారి చేతుల మీదగా మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ ప్రధానం చేయడం జరిగింది. టోర్నమెంట్ లో గెలిచిన విద్యార్థులను హాస్టల్ ఎస్ ఓ రాగ సుధా మేడం గారు మరియు ఉపాధ్యాయులు అందరూ అభినందించారని రంగారెడ్డి జిల్లా న్యూ మాన్స్ కుంఫు చీఫ్ ఇన్స్పెక్టర్ రమేష్ మాస్టర్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు.

You may also like...

Translate »