పదిలో 10/10 జీపీఏ సాధిస్తే విద్యార్థులకు రూ. 10 వేలు

పదిలో 10/10 జీపీఏ సాధిస్తే విద్యార్థులకు రూ. 10 వేలు


బిఆర్ఎస్ నాయకులు విఘ్నేష్ గౌడ్

జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా జనవరి 09:

చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల లో పదో తరగతుల 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు రూ. 10 వేల చొప్పున నగదు బహుమతి అందిస్తానని గొల్లపల్లి గ్రామానికి చెందిన విఘ్నేష్ గౌడ్ ప్రకటించారు. గురువారం చేవెళ్ల లోని కస్తూర్బా గాందీ విద్యాలయంలోని విద్యార్థులకు ఆర్డీవో చంద్రకళ, తహసీల్దార్ కృష్ణయ్య చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం ఆడవద్దని, గొప్ప లక్ష్యం తో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ.పదిలో 100 శాతం ఫలితాలు సాధించాలని, ఈ మేరకు టీచర్లు కృషి చేయాలని కోరారు. 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు తనవంతుగా రూ. 1000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. తహసీల్దార్ సైతం రూ.1000 ప్రకటించారు

You may also like...

Translate »