ఏప్రిల్ 4న శంకర్‌పల్లి కి రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ
శంకర్‌పల్లిలో ఏప్రిల్ 4న ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ జనుగుర్తి కేంద్రం ఆధ్వర్యంలో
ప్రకృతి సేంద్రియ రైతుల సమ్మేళనము
ముఖ్య అతిథులుగా హాజరుకానున్న రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
జ్ఞాన తెలంగాణ ,శంకర్‌పల్లి : శంకర్‌పల్లిలో ఏప్రిల్ 4న ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ జనుగుర్తి కేంద్రం ఆధ్వర్యంలో ప్రకృతి సేంద్రియ రైతుల సమ్మేళన కార్యక్రమం జరగనుందని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కోశాధికారి మాణిక్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ పరమేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం శంకర్‌పల్లి మండల కేంద్రంలోని అతిథి గృహంలో రైతు సమ్మేళన కార్యక్రమం కరపత్రాన్ని వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర, వ్యవసాయదారుడికి గౌరవం, ప్రజలందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందించాలనే ఉద్దేశ్యంతో దేశమంతటా, మన రాష్ట్రమంతటా మన జిల్లాలో కూడా ప్రయత్నం జరుగుతున్నదని పేర్కొన్నారు. అనేక సంవత్సరాలుగా రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు (పెస్టిసైడ్లు) విచక్షణా రహితంగా వాడటం వలన భూమి కలుషితమై పోయింది. కొన్ని చోట్ల భూమి బంజరుగా మారుతున్నది. పంట దిగుబడి కొరకు ఇంకా ఎక్కువ ఎరువులు (యూరియా.డి.ఏ.పి.ల వంటివి) వాడవలసి వస్తోంది. అయినప్పటికీ పంట దిగుబడి పెరగటం లేదనేది అందరి రైతులకు వస్తున్న అనుభవం. భూమి సుపోషణ,భూమిని సారవంతము చేయటం నేటి ఆవశ్యకత మన భారతీయ ఆవు పీడలో, ఆవు మూత్రంలో భూమిని సారవంతము చేసే కోట్లాది జీవాణువులు ఉన్నాయనేది జగమెరిగిన సత్యం, కానీ మనం మర్చిపోయాం. 50, 60 యేండ్లగా అలవాటు తప్పింది. గ్రామాలలో దేశీయ ఆవులు తగ్గిపోయాయి. కొన్ని గ్రామాలలో అయితే 1.2 ఆవులు కూడాలేకుండా పోయాయి. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి లేదా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులకు మంచి పంట పండుతోంది. కొద్ది ప్రయత్నం వల్ల సరియైన ధర కూడా లభిస్తోంది.మెదక్ జిల్లాలో ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తల ప్రయత్నం వలన 650 మంది రైతులు రసాయన ఎరువులు వదిలి. భారతీయ గో ఆధారిత వ్యవసాయం ప్రారంభించారు. ఒక వెయ్యి మంది రైతుల సమ్మేళనం జరిగిన విషయం. ఉపరాష్ట్రపతి జగరీవిధనకర్ పాల్గొని, రైతులందరినీ అభినందించిన విషయం మనందరికీ తెలిసినదే.
మన తర్వాతి తరాలకు అందించవలసిన అసలైన ఆస్తి ఆరోగ్యం. కాబట్టి అటువంటి ఆరోగ్యాన్నిచ్చే సేంద్రీయ వ్యవసాయం చేసే విధంగా అందరమూ ప్రయత్నము చేద్దామన్నారు. అందుకు మీరు కూడా మన పాలంలో ఆరెకరమో, ఒక ఎకరమో వ్యవసాయం ప్రకృతి లేదా సేంద్రియ ఇ్యవసాయం ప్రారంభించమని కోరుతున్నాము. ప్రకృతి లేదా సేంద్రియ వ్యవసాయం చేయుటకు కావలసిన శిక్షణను, సలహాలను జనుగుర్తి శంకరపల్లి, కులకచర్ల, పరిగి, వికారాబాద్ కేంద్రములుగా రైతులు, శాస్త్రవేత్తలు యిప్పునున్నారు. సేంద్రియ వ్యవసాయం చేయడం ద్వారా రైతు పండించిన పంటకు రేటు లేని కారణంగా రోడ్డు మీదే వదిలిపెట్టాల్సిన అవసరం ఉండదు. సేంద్రియ పద్ధతి ద్వారా పండించిన పంటలకు మార్కెట్ సహకారం ఈజివిఎఫ్ రైతులకు అందిస్తుంది. కార్యక్రమంలో అమరేందర్ రెడ్డి డిఐజి రిటైర్డ్ ఇండియన్ కోస్ట్ గాడ్, మాణిక్య రెడ్డి వ్యాపారస్తులు, నాగిరెడ్డి, మిర్యాల శ్రీనివాస్, బచ్చు రామ్మోహన్, శ్రీపాల్ రెడ్డి, శ్రీనివాస్, రాజేందర్, భస్వరాజ్, విష్ణువర్ధన్ రెడ్డి, నితిన్, వంశీ పాల్గొన్నారు.