శంకర్ పల్లి లో శ్రీ మణికంఠ ఆర్గానిక్ మిల్క్ పాయింట్ గొప్పప్రారంభం

శంకర్ పల్లి లో శ్రీ మణికంఠ ఆర్గానిక్ మిల్క్ పాయింట్ గొప్పప్రారంభం
- ముఖ్య అతిథి గా హాజరైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
- స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్
జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి : మండల కేంద్రమైన శంకర్ పల్లి మున్సిపాలిటీ పట్టణం లో శ్రీ మణికంఠ ఆర్గానిక్ మిల్క్ పాయింట్, ఐస్ క్రీం పార్లర్ అండ్ డ్రైఫ్రూట్స్ పాయింట్ బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మణికంఠ మిల్క్ పాయింట్ స్థాపకులు సామా మల్లారెడ్డి స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి ఘన స్వాగతం పలికి, పూల మాలలు శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన బ్రహ్మనోత్తములు ఆశీర్వచనాలు అందించారు. తనకు తాను స్వయం ఉపాధి కల్పించుకోవడమే కాకుండా మరో నలుగురికి ఉపాధి లభించేలా చిన్న తరహా బిజినెస్ ను ప్రారంభించిన సామా మల్లారెడ్డి గారిని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరియు శంకర్ పల్లి సిఐ సీఐ శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. అనంతరం సామా మల్లారెడ్డి అతిథులందరికీ మిఠాయిలు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి సబ్ ఇన్స్పెక్టర్, సామా మల్లారెడ్డి కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు పాల్గొన్నారు.

