ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీజ్యోతి భీమ్ భరత్

చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం మాచన్‌పల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రామీణ సంప్రదాయాలు, మహిళల సృజనాత్మకతను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ పోటీలు పండుగ వాతావరణాన్ని మరింత రమణీయంగా మార్చాయి. చిన్నా–పెద్ద తేడా లేకుండా గ్రామంలోని ఆడపడుచులు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులతో తమ ప్రతిభను చాటుకున్నారు. సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను, గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగా రెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీజ్యోతి భీమ్ భరత్ హాజరయ్యారు. పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను ఆమె అందజేసి పాల్గొన్న మహిళలను అభినందించారు. మహిళల భాగస్వామ్యం, సంప్రదాయ కళల పరిరక్షణలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి రామ్ రెడ్డి, గ్రామ నాయకుడు యాదయ్య, మహిళా కాంగ్రెస్ నాయకులు స్వరూపతో పాటు మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

You may also like...

Translate »