టంగటూర్ గ్రామంలో వీధి లైట్ల సమస్యకు పరిష్కారం

  • ప్రజా సమస్యను బాధ్యతగా తీసుకున్న బద్దం హరితకృష్ణ రెడ్డి

జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి :
గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని గ్రామ యువ నాయకుడు బద్దం హరితకృష్ణ రెడ్డి తెలిపారు. టంగటూర్ గ్రామంలో గత కొంతకాలంగా వీధి లైట్లు పనిచేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు.
గ్రామంలో చీకటి కారణంగా రోడ్లపై ప్రయాణం ప్రమాదకరంగా మారిందని, చిన్నపాటి అపఘాతాలు చోటుచేసుకునే అవకాశం ఉందని గ్రామస్తులు పలుమార్లు తన దృష్టికి తీసుకువచ్చారని హరితకృష్ణ రెడ్డి తెలిపారు. ప్రజల సమస్యలను పట్టించుకోవడం, వాటికి పరిష్కారం చూపడం తన బాధ్యతగా భావిస్తూ, వెంటనే స్పందించి వీధి లైట్ల ఏర్పాటు కోసం చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

You may also like...

Translate »