రహీం పుర లో ప్రధాన రహదారి పై నత్త నడకన పనులు

ఆందోళన చెందుతున్న వాహనదారులు
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,డిసెంబర్ 30 :
రహీం పురా లో ప్రధాన రహదారి పై వారం రోజులుగా పనులు జరుగుతుండడం వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగల్ హాట్ డీవిజన్ లోని రహీమ్ పురా లో గత వారం రోజులకు పై బడి భూగర్భ డ్రైనేజీ పైపు లైనుల పనులు కొనసాగుతుండడం తో ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ప్రాంతం లో నత్త నడకన పనులు కొనసాగుతుండడం తో అటు స్థానికులు ఇటు వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటి కైన అధికారులు దృష్టి సారించింది సత్వరమే పనులు వేగవంతం చేసేలా చూడాలని కోరుతున్నారు.
