సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం

- పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలి
- జోనల్ కమిషనర్ చంద్రకళ
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జనవరి 17 :
సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధంతోపాటు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని జోనల్ కమిషనర్ చంద్రకళ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలోని శనివారం గర్ల్స్ హైస్కూల్లో ప్రత్యేక పారిశుద్ధ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిహెచ్ఎంసి శంషాబాద్ జోన్ పరిధిలోని శంషాబాద్ సర్కిల్ 18లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా శంషాబాద్ గర్ల్స్ హైస్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ చంద్రకళ మాట్లాడుతూ చెత్త వేరు చేయడం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ప్రాముఖ్యతతో పాటు పరిసరాల పరిశుభ్రంగా ఉంచుతూ హరిత వాతావరణం కాపాడుకోవడం పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో పరిశుభ్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సుమన్ రావు, డిప్యూటీ ఈఈ అన్నపూర్ణ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
