గ్రామాల పటిష్టతకు శంకర్ పల్లి ఎంపీడీవో వెంకటయ్య గౌడ్ ప్రత్యేక ఫోకస్

గ్రామాల పటిష్టతకు శంకర్ పల్లి ఎంపీడీవో వెంకటయ్య గౌడ్ ప్రత్యేక ఫోకస్
- పారిశుద్ధ్యం, మంచి నీటి సౌకర్యం, తడి చెత్త, పొడి చెత్త నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచనలు
- ఇంకుడు గుంతలు, వర్షపు నీటి సేకరణ, వ్యక్తిగత మరుగుదొడ్లు సాధారణ సేవలకు సంబంధించిన రికార్డుల పై ఆరా
- ఈరోజు సాయంత్రం లోగా పూర్తి డాటా ఇవ్వాలని గ్రామ సెక్రెటరీలకు ఆదేశాలు జారీ చేసిన శంకర్ పల్లి ఎంపీడీవో
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: గ్రామపంచాయతీ సర్పంచ్ ల పదవీకాలం ముగిసి సంవత్సరం కాలం కావస్తున్నా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగక సర్పంచ్ లు లేకపోవడంతో, రాష్ట్ర వ్యాప్తంగా మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ల పై అదనపు భారం పడుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో శంకర్ పల్లి ఎంపీడీవో వెంకటయ్య గౌడ్ గ్రామ ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా గ్రామ ప్రజల కనీస అవసరాలు, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. శుక్రవారం గ్రామపంచాయతీ సెక్రెటరీల తో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామాలలో ఉన్న పరిస్థితులు పారిశుద్ధ్యం, మంచి నీటి సౌకర్యం వంటి వివిధ అంశాల పైన సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ పల్లి ఎంపీడీవో వెంకటయ్య గౌడ్ గ్రామపంచాయతీ సెక్రటరీలకు పలు సూచనలు చేస్తూ, ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య పనులు ప్రతిరోజు క్రమం తప్పకుండా జరగాలని, తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా సేకరించి, వాటికోసం ఏర్పాటుచేసిన వేరువేరు షెడ్లలో క్రమంగా వేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాలలో వీధులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఎక్కడైనా ప్లాస్టిక్ కవర్లు కనిపిస్తే అక్కడ నుంచి వాటి తొలగించి కాల్చివేయాలని సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలకు సంబంధించిన పూర్తి వివరాలు గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించి మిషన్ భగీరథ నీటి శుద్ధి, క్లోరిఫికేషన్ వంటి పనులు క్రమం తప్పకుండా నిర్వహించాలని, పూర్తి డాట రేపటి సాయంత్రంలోగా నాకు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. పైప్ లైన్ వాటర్ లీకేజీ కాకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని ఎక్కడైనా ఓపెన్ వాల్వ్ లు ఉంటే వాటిని వెంటనే మూసి వేయించాలని అన్నారు. పల్లె ప్రకృతి వనం, నర్సరీలు సరైన విధానంలో నిర్వహించాలని గ్రామ పంచాయతీకి సంబందించిన స్థిర , చర ఆస్తులన్నిటి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామపంచాయతీలకు రావలసిన ట్యాక్స్ లు ఎప్పటికప్పుడు వసూలు చేయాలని అన్నారు. అంగన్వాడి సెంటర్ మరియు స్కూల్ కి సంబంధించిన మరుగు దొడ్ల నిర్వహణ పైన ఆరా తీశారు. ప్రధానమంత్రి విశ్వకర్మ లబ్ధిదారుల డాటా పై పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలోశంకర్ పల్లి ఎంపీడీవో వెంకటయ్య గౌడ్, ఎంపిఓ, మిషన్ భగీరథ ఏఈఈ, గ్రామపంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.