రసాయన ఎరువుల వాడకం తగ్గించి భూసారాన్ని కాపాడాలని సూచన
జ్ఞానతెలంగాణ,గుమ్మడిదళ: aప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల నల్లవల్లి గ్రామంలో డా. వి.హేమలత, డా. జానకి శ్రీనాథ్ పాల్గొని రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. యూరియా, కాంప్లెక్స్ ఎరువుల వాడకం వాటి ప్రయోజనాలు దుష్ప్రభావాలు , పంట మార్పిడి విధానాలు, సస్యరక్షణ చర్యలు, నీటి ప్రాముఖ్యత, నీటి వినియోగ సమర్థత, కూరగాయల సాగులో మెలకువలు, వరి పంటలలో వైవిధ్యీకరణ, కోతుల బెడదను అరికట్టడం మరియు విత్తనాలు పురుగుమందుల కొనుగోలు సమయంలో బిల్లు తప్పనిసరి వంటి పలు అంశాలపై అవగాహన కల్పించారు . ఈ కార్యక్రమంలో గ్రామ ఏఈఓ డి. ప్రణవి, పి.లావణ్య, యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థులు రాజ్ కుమార్, వెంగళరావు గ్రామ అభ్యుదయ రైతులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.