ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయంరాష్ట ప్రభుత్వం వర్గీకరణ అమలోకి తీసుకురావాలి

ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయంరాష్ట ప్రభుత్వం వర్గీకరణ అమలోకి తీసుకురావాలి


  • ఎంఆర్పీఎస్ నిర్వహిస్తున్న వెయ్యి గొంతులు లక్ష డప్పులు ప్రదర్శనకు బీసీ సేన పూర్తి మద్దతు
  • తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంఆర్పీఎస్ పాత్ర బలంగా ఉంది
  • ఆఖరి వరకు అలుపెరుగని పోరాటం చేసి విజయం సాధించుకున్న మాదిగ సోదరులకు ఉద్యమాభి వందనాలు
  • బీసీ సేన రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్

జ్ఞాన తెలంగాణ, కొందుర్గు, షాద్నగర్ ప్రతినిధి జనవరి 04:

ఈరోజు కొందుర్గ్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది ఈ సమ్మేళనంలో పాల్గొన్న బీసీ సేన రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ గారు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమం దాదాపు 30 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు ఒచ్చిన ఎన్ని కష్టాలు ఒచ్చిన ఎంత మంది అవమానించిన ఎక్కడ వెనకడుగు వెయ్యకుండా అలుపెరుగని పోరాటం చేసి విజయం సాధించుకున్న మిత్రులకు ఉద్యమాభి వందనాలు తెలియజేస్తున్నాను ఎంఆర్పీఎస్ చేయబోయే వెయ్యి గొంతుకలు లక్ష డప్పుల కార్యక్రమానికి బీసీ సేన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంఆర్పీఎస్ పాత్ర బలంగా ఉన్నదని కెసిఆర్ దీక్ష చేసినప్పుడు మందకృష్ణ గారే జ్యూస్ ఇచ్చి విరమించారని కానీ కేసీఆర్ కి అ కృతజ్ఞత లేదని అందుకే 10 సంవత్సరాలలోనే వారికి ప్రజలు బుద్ధి చెప్పారని రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో ఎంత ప్రేమ ఉన్నట్టు మాట్లాడారని అది ఆచరణలో చూపిస్తే బాగుంటుందని వారు అన్నారు అదే ఆరోగ్య శ్రీ పథకం వొచ్చిందే ఎంఆర్పీఎస్ వలన అని ఎంఆర్పీఎస్ అన్ని వర్గాల కోసం పని చేసిందని కావున ఎంఆర్పీఎస్ కి మా మద్దతు కూడా సంపూర్ణ ఉంటుందని వారు అన్నారు

You may also like...

Translate »