ఘనంగా సర్వాయి పాపన్నగౌడ్ జయంతి

జ్ఞాన తెలంగాణ,కట్టంగూర్, ఆగస్టు 18 : సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 375వ జయంతి కార్య క్రమాన్ని సోమవారం మండలంలోని పరడ, బొల్లెపల్లి, కట్టంగూర్, ఈదులూరు గ్రామాల్లో గౌడ్ సంఘం, గీత పారి శ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ్ సంఘం నాయకులు పాపన్న విగ్రహానికి, చిత్రపటానికి పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయా కార్యక్రమంలో విశ్రాంతి ఉపాధ్యాయులు యర్కల సత్తయ్య, గౌడ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు కానుగు శ్రీను, నాయకులు బద్దం శ్రీనివాస్, కొండ యాదయ్య, బద్దం రాములు, నర్సింహ్మ, యాదయ్య, శ్రీను, లింగయ్య, ఐతగోని సైదులుచ, ఐతగోని శివ, నవీన్, పోగుల యాదగిరి, పోగుల తిరుమలేష్, కొంపెల్లి సైదులు, ఐతగోని నాగయ్య, చంద్రయ్య, వెంకన్న, దొరెపల్లి శ్రీను, అంతటి సతీష్, యాదగిరి, కానుగు సైదులు, గాదగోని వెంకన్న, సిగ శ్రీను, పొడిచేటి కిరణ్, వడ్లకొండ అశోక్, యర్కల సత్తయ్య, కానుగు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »