రేపు షాద్ నగర్ కు ప్రజా యుద్ధనౌక ఏపూరి సోమన్న రాక

రేపు షాద్ నగర్ కు ప్రజా యుద్ధనౌక ఏపూరి సోమన్న రాక
- రేపు 30 న జరిగే మాదిగ కవులు కళాకారుల సమావేశాన్ని విజయవంతం చేయండి
- పెంట నోళ్ళ నరసింహ మాదిగ MRPS రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు
జ్ఞాన తెలంగాణ, షాద్నగర్, షాద్నగర్ ప్రతినిధి డిసెంబర్ 29 :
మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఫిబ్రవరిలో 3న హైదరాబాద్ లో జరిగే వెయ్యి గొంతులు లక్ష డప్పుల ప్రదర్శనను విజయవంతం చేయడం కోసం రేపు 30 తారీఖున షాద్ నగర్ లోని సాయి రాజ ఫంక్షన్ హాల్లో ఉదయం11 గంటలకు నిర్వహించే కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ మరియు మాదిగ కళామండలి, డప్పు కళాకారులు కవులు అన్ని అనుబంధ సంఘాలతో సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రజా యుద్ధనౌక డాక్టర్ ఏపూరి సోమన్న మాదిగ మాదిగ కళా మండలి జాతీయ అధ్యక్షులు NY అశోక్ మాదిగ గారు పాల్గొంటారు కాబట్టి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని విభాగాల నాయకులు కార్యకర్తలు కవులు కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో
కల్లేపల్లి బాల్ రాజ్ పొట్ట నరసింహ చింతకింది శివకుమార్ దుబ్బ నరసింహ దశరథ్ ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.