ప్రజాపాలన–ప్రగతి సమీక్ష: MPDO వెంకటయ్య ఆదేశాలు

ప్రజాపాలన–ప్రగతి సమీక్ష: MPDO వెంకటయ్య ఆదేశాలు


జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :
శంకర్‌పల్లి మండల కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి (MPDO) వి. వెంకటయ్య ఆధ్వర్యంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అమలుపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం, అలసత్వం సహించబోమని ఈ సందర్భంగా ఆయన అధికారులను కఠినంగా హెచ్చరించారు. గ్రామాభివృద్ధి కార్యక్రమాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరేలా సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.
సమావేశానికి పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (PRAEE), రూరల్ వాటర్ సప్లై (RWS) విభాగానికి చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE), వెటర్నరీ డాక్టర్లు, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు మరియు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చిస్తూ ప్రతి అంశంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.
మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు వంటి ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద సోక్ పిట్స్ నిర్మాణం, నీటి సంరక్షణ పనులు మరియు గ్రామ మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని తెలిపారు.
అదే విధంగా వనమహోత్సవం కార్యక్రమం, గ్రామాల్లో శానిటేషన్ నిర్వహణ మరియు పన్నుల వసూలు అంశాలపై కూడా సమీక్షించారు. ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తప్పవని MPDO వెంకటయ్య స్పష్టం చేశారు

You may also like...

Translate »