శంకర్‌పల్లిలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక ప్రారంభం

99 రోజుల ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం
శంకర్‌పల్లి, మార్చి 06: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శంకర్‌పల్లి మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఉదయం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ (సిడిఎంఎ) డా. టి.కే. శ్రీదేవి మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం మార్చి 6 నుంచి జూన్ 12 వరకు మొత్తం 99 రోజుల పాటు కొనసాగనున్నట్లు ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా డా. శ్రీదేవి మాట్లాడుతూ పట్టణాభివృద్ధి, పారిశుద్ధ్యం, ప్రజా సేవల మెరుగుదల లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం, క్రీడలు, యువత మరియు నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై విడతల వారీగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రజలందరూ చురుకుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
అదేవిధంగా మార్చి 6 నుండి 15వ తేదీ వరకు పరిసరాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ మరియు సమస్యల పరిష్కారంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు. రోడ్లపై చెత్త వేయకుండా జాగ్రత్తలు పాటించాలని, తడి చెత్త–పొడి చెత్తను వేరు చేయాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు సూచించారు. శంకర్‌పల్లి పట్టణం పారిశుద్ధ్య పరంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ కే. ఫల్గుణ్ కుమార్, వైస్ చైర్‌పర్సన్ జూలకంటి శ్వేత పాండురంగ రెడ్డి, కౌన్సిల్ సభ్యులు దండు రాజేశ్వర్, అశోక్, ఉషాకిరణ్ విజయ్ కుమార్, ఆనంద్ రావు, గణేష్, గిరిజ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ యోగేష్, మేనేజర్ అంజన్ కుమార్, డిఈ యాదయ్య, ఏఈ నరేష్, మెప్మా ఆర్పీలు, పారిశుద్ధ, మున్సిపల్, రెవెన్యూ మరియు ఇతర లైన్ డిపార్ట్మెంట్ల సిబ్బంది పాల్గొన్నారు.



Public Administration-Progress Plan launched in Shankarpally
