జిల్లా స్థాయి వాలీ బాల్ క్రీడలకు పొద్దటూర్ పాఠశాల విద్యార్థినులు

ప్రయాణ సౌకర్యం కల్పించిన పొద్దటూర్ మాజీ డిప్యూటీ సర్పంచ్ సురకంటి మల్లారెడ్డి


కృతజ్ఞతలు తెలియజేసిన అమ్మా ఆదర్శ పాఠశాల ఛైర్పర్సన్ ఏనుగు లక్ష్మి మరియు క్రీడాకారులు

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడానైపుణ్యాన్ని వెలికి తీసి తెలంగాణ రాష్ట్రం తరపున ప్రొఫెషనల్ క్రీడాకారులు గా తయారు చేయడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సి ఎం కప్ లో భాగంగా, శంకర్ పల్లి మండలం లోని పొద్దటూర్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు మండల స్థాయిలో సత్తా చాటి జిల్లా స్థాయి వాలీ బాల్ టోర్నమెంట్ కు ఎంపికైన విషయం తెలిసిందే, కాగా జిల్లాస్థాయి వాలీ టోర్నమెంట్ ను రంగారెడ్డి జిల్లా లోని సరూర్ నగర్ స్టేడియం లో శుక్రవారం నిర్వహించారు. ఈ టోర్నమెంట్ కు పొద్దుటూరు గ్రామ హై స్కూల్ కు చెందిన ఆరుగురు విద్యార్థినులు ఎంపికయ్యారు. ఎన్నికైన విద్యార్థినులు మరియు పొద్దుటూరు గ్రామ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ ఏనుగు లక్ష్మి లు క్రీడాకారులకు ప్రయాణ సౌకర్యం కల్పించాలని పొద్దుటూరు గ్రామ మాజీ డిప్యూటీ సర్పంచ్ సురకంటి మల్లారెడ్డి కి విజ్ఞప్తి చేయగా, జిల్లాస్థాయి వాలీబాల్ కు ఎన్నికైన క్రీడాకారులను అభినందించి, మాజీ ఉప సర్పంచ్ సురకంటి మల్లారెడ్డి తన స్వంత ఖర్చులతో వెహికల్ ను ఏర్పాటు చేయడమే కాకుండా,స్నాక్స్ తదితర ఖర్చులకు అదనంగా డబ్బులు ఇచ్చి, క్రీడాకారులకు తన వంతు సహాయం అందించారు. శుక్రవారం నాడు సరూర్ నగర్ స్టేడియంలో శంకర్ పల్లి మండలం తరపున ప్రాతినిధ్యం వహించిన వాలీబాల్ అమ్మాయిల జట్టు, వివిధ లీగ్ మ్యాచ్ లు అవలీలగా గెలిచి, ఒకే ఒక్క పాయింట్ తేడాతో షాబాద్ బాలికల చేతిలో క్వార్టర్ ఫైనల్ లో పోరాడి ఓడింది. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ మమ్ములను ప్రోత్సహిస్తూ ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాకుండా స్నాక్స్ మరియు ఫ్రూట్స్ కొరకు కూడా డబ్బులు ఇచ్చిన మా పొద్దటూరు మాజీ డిప్యూటీ సర్పంచ్ సురకంటి మల్లారెడ్డి కి, మా తో పాటు వచ్చి ప్రోత్సహించిన అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్పర్సన్ ఏనుగు లక్ష్మి మరియు ఎల్లప్పుడు మా క్రీడాకారులకు అండగా నిలిచిచే పొద్దటూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఏనుగు నర్సింహా రెడ్డి, పొద్దటూరు గ్రామ మాజీ ఎంపిటిసి శంకర్ పల్లి మండల ఎంపిపి బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి గార్లకు కృతజ్ఞతలు తెలియ జేస్తున్నామని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు

–సురకంటి మల్లారెడ్డి,మాజీ డిప్యూటీ సర్పంచ్ పొద్దుటూరు గ్రామము

You may also like...

Translate »