పచ్చని పల్లెల్లో నివురు గప్పిన నిప్పులా పెట్రోల్ బంకులు

- పంట చేల మీద ప్రభావం చూపిస్తాయంటూ ప్రజల ఆందోళన
- అడ్డగోలుగా అనుమతులు అంటూ ప్రజల ఆగ్రహం
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జనవరి 8 :పచ్చని గ్రామాల్లో సైతం నివురు గప్పిన నిప్పులా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం ఆందోళన కలిగిస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఓవైపు సెల్ టవర్లు మరోవైపు పెట్రోల్ బంకులు పంటల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో పెట్రోల్ బంకులు విచ్చలవిడిగా వెళుతున్నాయి. పచ్చని పల్లె గ్రామాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు అవుతున్నాయని దీనివల్ల పంటలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలతో కళకళలాడాల్సిన పల్లెల్లో సైతం సెల్ టవర్లు ఏర్పాటు చేశారని దీనిపై రేడియేషన్ ప్రభావం ఇప్పటికే ఎంతో దారుణంగా ఉన్న విషయం తెలిసిందే. అదే మాదిరిగా గ్రామాలలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడం దీనివల్ల ఎలాంటి ప్రభావం చూపనుందోనని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో విచ్చలవిడిగా పుట్టగొడుగుల్లా పెట్రోల్ బంకులు ఏర్పాటు కావడం ఆందోళన కలిగించే విషయమని రైతులు మండిపడుతున్నారు. ఓవైపు వరిచేలు మరోవైపు పూల తోటలు ఇలా పచ్చగా మిగిలి ఆడాల్సిన పల్లెల్లో విషపుకుంపటిలా పెట్రోల్ బంకులు ఏర్పాటు కావడం దారుణమైన విషయమని వాపోతున్నారు. మండల పరిధిలోని పెద్ద గోల్కొండ గొల్లపల్లి నర్కుడ తదితర ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు వెలుస్తున్నాయి. అధికారులు కూడా వీటికి అనుమతులు ఉన్నాయా ఉంటే ఊరికి ఎంత దూరంలో వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు అనేదానిపై ఆరా తీసి ఉచ్చలవిడిగా గెలుస్తున్న పెట్రోల్ బంకులపై దృష్టి సారించాలని స్థానికులు రైతులు కోరుతున్నారు


