కొనసాగుతున్న కృష్ణమూర్తి, మల్లయ్య మెమోరియల్ ట్రస్ట్ సేవలు

కొనసాగుతున్న కృష్ణమూర్తి,మల్లయ్య మెమోరియల్ ట్రస్ట్ సేవలు


శంకర్ పల్లి లో టాలెంట్ టెస్ట్ నిర్వహణ

పది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుండి పాల్గొన్న విద్యార్థులు

విజేతలకు నగదు తో పాటు, విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు జ్ఞాపికలు అందజేత


జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: మనం కన్న కలల్ని సార్ధకం చేసుకోవడానికి, పద్మభూషణ్,పద్మ విభూషణ్, భారతరత్న, మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాంవలే, ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వలె పట్టుదల నిరంతర కృషి తో బాగా కష్టపడి చదవాలని, అలాంటి చదివే మనల్ని ఉన్నత స్థాయిలో నిలుపుతుందని శంకర్ పల్లి మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్ అన్నారు.

ఆదివారం నాడు శంకర్ పల్లి మాడల్ స్కూల్ లో నిర్వహించిన మండల స్థాయి పొట్లూరి కృష్ణమూర్తి మరియు గోనె మల్లయ్య గారి మెమోరియల్ టాలెంట్ టెస్ట్ లో భాగంగా నిర్వాహకులు గోనె ప్రతాప్ పొట్లూరి శ్రీనివాస్ గార్లతో కలిసి పాల్గొన్న శంకర్ పల్లి మండల ఎంఈఓ సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ, చదువుకు పేదరికం అడ్డు కాదని మన దేశ ప్రథమ పౌరురాలు భారత రాష్ట్రపతి గౌరవ శ్రీమతి ద్రౌపతి ముర్ము మారుమూల గిరిజన ప్రాంతంలో పుట్టి కష్టపడి అత్యున్నత స్థాయిలో ఉన్నారని ఇలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని పట్టుదలతో ఉన్నత విద్యావంతులు గా ఎదగాలని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు గోనె ప్రతాప్ మరియు పొట్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.., మన దేశం గర్వించేలా ఉన్నత స్థాయిలో మనం నిలవడానికి ఇలాంటి టాలెంట్ టెస్టులు ఎంతగానో ఉపయోగపడతాయని ఇలాంటి అవకాశాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ప్రభ ప్రతిభ చాటాలని అన్నారు. విద్యార్థి దశనుంచే గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని విద్యాభ్యాసం కొనసాగించాలని సూచించారు. ఈ టాలెంట్ టెస్ట్ లో విజేతలుగా ప్రథమ స్థాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొండకల్ విద్యార్థి ఎస్ దేవ్ వర్ధన్, ద్వితీయ విజేతగా ఎం కృష్ణ వంశీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టంగటూర్, తృతీయ బహుమతి విజేతగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జనవాడ విద్యార్థులు నిలిచారు. ప్రథమ స్థానం సాధించిన కొండకల్ విద్యార్థి ఎస్ దేవవర్ధన్ కు మూడు వేలు, ద్వితీయ స్థానం పొందిన టంగుటూరు పాఠశాల విద్యార్థి ఎం కృష్ణ వంశీకి రెండు వేలు, తృతీయ స్థానం పొందిన జనవాడ పాఠశాల విద్యార్థికి వెయ్యి రూపాయల నగదుతో పాటు శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి చెందిన పుస్తకాలు మరియు జ్ఞాపికలను అందజేశారు. ఈ యొక్క టాలెంట్ టెస్ట్ కు మండలంలోని 10 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని పోటీ పడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శోభారాణి రావులపల్లి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జయసింహా రెడ్డి , టంగుటూరు పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు ఉషారాణి, సామాజిక కార్యకర్త తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పాప గారి ఆశీర్వాదం, ఎం జంగయ్య, ఎం శంకరయ్య, రాజేందర్ శ్రీనివాస్, విజయలక్ష్మి ,వీరేశం, కళ్యాణి కస్తూరీ, అర్చన మరియు శ్రీహరి, లక్ష్మిలు పాల్గొన్నారు.

You may also like...

Translate »