షాద్ నగర్ లోని గ్రామాలలో అమ్మవారిని దర్శించుకున్న ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

  • అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి,

జ్ఞాన తెలంగాణ,షాద్ నగర్ ప్రతినిధి, సెప్టెంబర్ 30:

షాద్ నగర్ లోని నందిగామ,ఇన్మూల్ నార్వ,షాద్ నగర్ పట్టణంలోని నెహ్రూ, రాఘవేంద్ర,గంజి,శ్రీనివాస కాలనిలో అమ్మవారి విగ్రహాల మండపం వద్ద దుర్గాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారికి ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డిని పలు మండపాల నిర్వాహకులు శాలువాలతో సన్మానించి ఘనంగా సత్కరించారు. ప్రత్యేక పూజ కార్యక్రమాల అనంతరం వేద పురోహితులు ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డికి తీర్థప్రసాదాలు అందించి అమ్మవారి ఆశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి రాహు కేతువుల దోషాలు తొలగించే దుర్గాదేవి నవరాత్రుల్లో అతి ముఖ్యమైన అవతారమని, చిరకాల బాధల నుంచి ఉపశమనం పొందాలన్నా, దారిద్రం తొలగి ఐశ్వర్యాలతో తులతూగాలన్న, ఇహలోక పరలోక సుఖాలను పొందాలన్న దుర్గాష్టమి రోజున దుర్గాదేవి అమ్మవారికి పూజలు నిర్వహిస్తే శుభ ఫలితాలు ఉంటాయని,శక్తికి ప్రతీక అయిన అమ్మవారిని పూజిస్తే తన శక్తితో అందరికీ సుఖ సంతోషాలు ప్రసాదిస్తారని,ఆయురారోగ్యాలు కలగజేస్తుందని ఆకాంక్షించారు.కౌన్సిలర్లు ఈశ్వర్ రాజు, కానుగు అనంతయ్య, మానస యాదగిరి,జపల్లి కౌసల్య శంకర్,పిల్లి శారద శేఖర్ మాజీ కౌన్సిలర్ పాలమాకుల చెన్నయ్య, నాయకులు రేకొండ రవీందర్ రెడ్డి,వేణుగోపాల్,ఎర్ర అంజయ్య రామేశ్వర్ గౌడ్,బిలాల్, చింతలపల్లి రాజేందర్ రెడ్డి, అశోక్,ప్రభాకర్,సతీష్,రాజ రామేశ్వర్ రెడ్డి,ఏదిర శ్రీకాంత్ గౌడ్, యువసత లక్ష్మణ్,శ్రీశైలం(లడ్డు) గౌడ్,చందు,ప్రదీప్,రమేష్,స్వామి,శ్రీనివాస్ గౌడ్, అష్రఫ్,మహమ్మద్ సాదక్, శంకర్, ప్రకాష్, జయంత్ రెడ్డి,ప్రవీణ్,అభిలాష్,సందీప్,sp శివ, మురళి యాదవ్,రాజు ముదిరాజ్,శ్రీను,కన్నయ్య, విశ్వేశ్, సాయి,శివకుమార్,రమేష్,చరణ్,
సతీష్,కిరణ్ సాయి ప్రసాద్,కుంచం సంతోష్ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »