బిఆర్ఎస్ బలోపేతానికి కొత్త శక్తి – శంకర్ పల్లి మండలంలో బాల్ రాజ్ గౌడ్ చేరిక

బిఆర్ఎస్ బలోపేతానికి కొత్త శక్తి – శంకర్ పల్లి మండలంలో బాల్ రాజ్ గౌడ్ చేరిక



జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్ పల్లి మండలం అంతప్పగూడ గ్రామానికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మాజీ మండల అధ్యక్షుడు బాల్రాజ్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని, మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు మరియు బి ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విజయ్ ఆర్య క్షత్రియ సమక్షంలో బిఆర్ఎస్పార్టీ లో చేశారు.

ఈ సందర్భంగా బాల్రాజ్ గౌడ్ మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం బిఆర్ఎస్ పార్టీ హయాంలోనే సాధ్యమైంది. రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం అనివార్యం” అని విశ్వాసం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు, కాళేశ్వరం ప్రాజెక్ట్, దళిత బంధు, కంటి వెలుగు, మిషన్ భగీరథ వంటి పథకాలు తెలంగాణ ప్రజల జీవితాలలో మార్పును తీసుకువచ్చాయని తెలిపారు.
బిఆర్ఎస్ పార్టీలో చేరిన అనంతరం బాల్ రాజ్ జ్ గౌడ్ మాట్లాడుతూ..,పార్టీ నాయకత్వంతో కలిసి గ్రామాల్లో ప్రచారం నిర్వహించి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను స్వీకరిస్తానని రాబోయే ఎన్నికల్లో పార్టీ ఘనవిజయాన్ని సాధించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, బిఆర్ఎస్ ను కొనసాగించడానికి ప్రజలు మద్దతుగా నిలవాలని బాల్ రాజ్ గౌడ్ పిలుపునిచ్చారు.

You may also like...

Translate »