జ్ఞానతెలంగాణ,చౌదరి గూడ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చౌదర్ గూడ లో ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం జరిగింది పాఠశాల ప్రధానోపాధ్యాయులు సునీత మేడం ఆధ్వర్యంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ సైన్స్ దినోత్సవం పట్ల విద్యార్థులు ఉత్సాహం గా పాల్గొన్నారు చాలా విషయాలను పరిశీలన చేస్తూ ఉంటే సైంటిస్ట్ గా ఎదగడానికి అవకాశం ఉంటుందని అన్నారు పాఠశాలలో విద్యార్థులు సైన్స్ సంబంధించిన పటాలను రంగవల్లిక రూపంలో రంగురంగులతో వేయడం జరిగింది అలాగే పాఠశాలలోని విద్యార్థులను నాలుగు గ్రూపులుగా చేసి క్విజ్ నిర్వహించడం జరిగింది మరియు విద్యార్థులు సైన్స్ సైంటిస్టుల గురించి చక్కగా వివరించడం జరిగింది డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా జరిగింది పాఠశాల నుండి జీవశాస్త్ర ఉపాధ్యాయుడు శంకర్ గారు మాట్లాడుతూ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం విధంగా ఉందో దాన్ని పిల్లలకి అర్ధం అయ్యే రీతిగా ఎంతో చక్కగా వివరించడం జరిగింది అలాగే భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు నరేందర్ మరియు జామ కుశాల్ విద్యార్థుల ఉద్దేశించి చక్కటి ఉపన్యాసం ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు భాను చంద్ర మేడం వాణి కళ్యాణి శ్రీనివాస్ జామ కుషాల్ నరేందర్ శంకర్ గౌడ్ భాగ్యలక్ష్మి పార్వతమ్మ తదితరులు