ఘనంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య జన్మదిన వేడుకలు.

ఘనంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య జన్మదిన వేడుకలు.
జ్ఞాన తెలంగాణ,షాబాద్,సెప్టెంబర్ 13:
షాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా బిసి సేన రాష్ట్ర అధ్యక్షుడు బర్క కృష్ణ ఆధ్వర్యంలో షాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి,రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిసి సేన రాష్ట్ర అధ్యక్షుడు బర్క కృష్ణ,తెలంగాణ ప్రజా చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు నరసింహులు,బీసీ సేన రాష్ట్ర కార్యదర్శి శ్రీశైలం,గౌడ సంఘం మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్,ఫోటోగ్రాఫర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు లింగం గౌడ్,బీసీ సేన మండల అధ్యక్షుడు రమేష్, శ్రీశైలం,తొంట వెంకటేష్,శ్రీనివాస్, షాబాద్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సతీష్ తదితరులు పాల్గొన్నారు