శంకర్ పల్లి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో ఘనంగా జాతీయ రైతు దినోత్సవ వేడుకలు

శంకర్ పల్లి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో ఘనంగా జాతీయ రైతు దినోత్సవ వేడుకలు


రైతు వేషధారణలో నాటిక ప్రదర్శన ల తో అలరించిన శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు

జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి: శంకర్ పల్లి పట్టణం లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో జాతీయ రైతు దినోత్సవ వేడుకలను పలువురు రైతులు విద్యార్థుల మధ్యన ఆ పాఠశాల యాజమాన్యం అత్యంత ఘనంగా నిర్వహించింది. దేశానికి వెనుముకగా నిలుస్తున్న రైతు తనకు ఎంతటి కష్టం వచ్చినా, నష్టం వచ్చిన దేశ ప్రజల కడుపు నింపడం కొరకు అహర్నిశలు కష్టపడుతున్న విధానాన్ని, రైతు వేషధారణలో నాటిక రూపంలో శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది, పంట చేతికి రావడం కొరకు ఆరు నెలలు రాత్రనకా, పగలనకా కష్టపడి ఫలితం వస్తుందో లేదో నన్న బాధను లోలోన భరిస్తూనే, ప్రకృతి మీద అటు ప్రభుత్వం మీద ఆధారపడి, ఒకవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి ని తట్టుకొని అన్నదాత గా నిలుస్తున్న విధానాన్ని నాటిక రూపంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు.

ఈ సందర్భంగా ఈ శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, ప్రిన్సిపల్ రాజేష్ గౌడ్, పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ.., రైతుల గురించి, వ్యవసాయ రంగం గురించి అనునిత్యం ఎంతగానో ఆలోచించి అనేక ఉద్యమాల ద్వారా జమీందారీ చట్టం రద్దు చేయించి, కౌలు దారి చట్టం అమల్లోకి వచ్చేలా చేసి, రైతులకు బ్యాంక్ ద్వారా రుణాలు అందించే విధానం వంటి అనేక గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన భారతదేశ ఐదవ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ చేసిన సేవలకు గాను ఆయన పుట్టినరోజు అయిన డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం గా యావత్ భారత దేశ ప్రజలంతా జరుపుకుంటారని అన్నారు. చౌదరి చరణ్ సింగ్ భారతదేశ ప్రజల విజేతగా, రైతు బంధువుగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారని కొనియాడారు. రైతు లేనిదే మనిషి లేడు, రైతు దేశానికి వెన్నుముక వంటి వాడని విద్యార్థులకు హితబోధ చేశారు.రైతుల కొరకు ఆయన చేసిన సేవలకు గాను 1998 లో భారత ప్రభుత్వం ఆయన చిత్రంతో తపాలా బిళ్ళను విడుదల చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, ఏజీఎం పల్లె వెంకట్, పాఠశాల ప్రిన్సిపల్ రాజేష్ కుమార్, కోఆర్డినేటర్ స్వామి, డీన్ కిరణ్ , వీరమని, తులసి, జ్యోతి, ఏవో చంద్రశేఖర్ రెడ్డి, ఇన్చార్జులు రేష్మ, రాధిక, స్వాతి రైతులు రవీందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సత్యనారాయణ, చిరంజీవి, వెంకట్ రామ్ రెడ్డి మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

You may also like...

Translate »