జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి : గ్రామపంచాయతీ, ఎంపీటీసీల ఎన్నికల నేపథ్యంలో శంకర్‌పల్లి మండల పరిధిలోని గోపులారం, పిల్లిగుండ్ల, దొంతాన్ పల్లి, మహారాజ్ పేట్ గ్రామాలలో గల పోలింగ్ కేంద్రాలను శనివారం మండల అభివృద్ధి అధికారి వెంకయ్య గౌడ్ పరిశీలించారు. అనంతరం పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న వసతులను ఎంపీడీవో తనిఖీ చేశారు. కార్యక్రమంలో మండల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.