అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
- పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలి
- విద్యార్థిని ,విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి
- చేవెళ్ల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు జైపాల్,శ్రీకాంత్
చేవెళ్లే డివిజన్ పి డి ఎస్ యు నాయకుల ముందస్తు అరెస్టు చేయడం సరైన విధానం కాదని పి డి ఎస్ యు నాయకులు తెలియజేయడం జరిగింది. అరెస్టులతో ప్రశ్నించే గొంతుకలను ఆపలేరని పేర్కొనడం జరిగింది.
ఈ సందర్భంగా పి డి ఎస్ యు చేవెళ్ల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు జైపాల్, శ్రీకాంత్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు రావాల్సినటువంటి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ను వెంటనే విడుదలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్లో , గురుకులాలలో, మైనార్టీ హాస్టల్లో విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అడుగుతున్నా పిడిఎస్యు సంఘ నాయకులను అరెస్టు చేయడం ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని తెలియజేయడం జరిగింది. ఇప్పటికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ వల్ల ఎంతోమంది విద్యార్థిని, విద్యార్థులు బాధపడుతూ ఉన్నారని దానితోపాటు హాస్టల్లో విద్యాధికారుల పర్యవేక్షణ లోపంతోటే హాస్టల్లో సరైన మౌలిక వసతుల సమస్యలను నెలకొని ఉన్నాయని , కనీసం ఏ ఒక్క హాస్టల్ ని కూడా సందర్శించడం లేదని ఇది విద్యాధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని తెలియజేయడం జరిగింది. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించే వరకు పి డి ఎస్ యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేయడం జరిగింది. ఈ రోజు డి ఎస్ యు చేవెళ్ల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు జైపాల్, శ్రీకాంత్ తో పాటు నాయకులు అశోక్ ప్రభాస్ లను ముందస్తు అరెస్టు చేయడం జరిగింది