గుంతలు, బురదతో చిత్తడిగా మారిన మొయినాబాద్-వెంకటాపూర్ రోడ్డు

గుంతలు, బురదతో చిత్తడిగా మారిన మొయినాబాద్-వెంకటాపూర్ రోడ్డు

  • వర్షాల కారణంగా రోడ్డు జలమయం, బురదతో కష్టతరమైన ప్రయాణo
  • వెంటనే రోడ్డు నిర్మాణం చేయాలని శ్రీరామ్ నగర్ గ్రామ ప్రజల డిమాండ్

జ్ఞాన తెలంగాణ, మయినాబాద్:
మొయినాబాద్ నుంచి వెంకటాపూర్ వరకు ఉన్న రోడ్డు పరిస్థితి దారుణంగా మారి, ప్రజల జీవన ప్రమాణాలను అస్తవ్యస్తం చేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా రోడ్డు జలమయంగా మారిపోయి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తూ, సాధారణ ప్రయాణం ఒక పోరాటంగా మారింది.

శ్రీరామ్ నగర్ వాసులు మరియు పక్కన ఉన్న గ్రామాల ప్రజలు ప్రతిరోజూ ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పుడు అనేక ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వెంటనే ఈ రోడ్డు మరమ్మతులు చేసి, సురక్షిత ప్రయాణం కల్పించి వారి జీవనాధారం కాపాడాలని శ్రీరామ్ నగర్ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.

You may also like...

Translate »